నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాయుగుండం ప్రభావంతో కురిసిన వానకు జిల్లాలోని ఎడపల్లి, ఆర్మూర్, నవీపేట్, మెండోరా, ముప్కాల్, బాల్గొండ, జక్రాన్పల్లి మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలు తడిసిముద్దయ్యాయి.
చిరుజల్లులతో చల్లబడ్డ ఇందూరు - kamareddy rains
భానుడి తీవ్రతతో అల్లాడిపోతున్న ఇందూరు ఒక్కసారిగా కురిసిన వర్షంతో చల్లబడింది. వాయుగుండం ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వానకు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఉపశమనం పొందారు.
చిరుజల్లులతో చల్లబడ్డ ఇందూరు
ఎండలతో సతమతమవుతున్న ఇందూరు ప్రజలు వాతావరణం చల్లబడటం వల్ల ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.