తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవి ప్రారంభంలోనే నీటి పోరు - MUNICIPAL COMMISIONER

తాగునీరే సకల ప్రాణ కోటికి జీవనాధారం. అంతటి ప్రాముఖ్యం ఉన్న నీరు లేకపోతే జనజీవనం అస్తవ్యస్తం అవడం ఖాయం. వేసవి ప్రారంభంలోనే వచ్చిన ఈ సమస్యనూ తీర్చాలంటూ బోధన్ వాసులు రోడ్డెక్కారు.

బిందెలతో బైఠాయించి కమిషనర్ వెంటనే రావాలంటూ నినాదాలు

By

Published : Mar 16, 2019, 2:49 PM IST

Updated : Mar 16, 2019, 2:54 PM IST

తాగునీటి కష్టాలను తీర్చాలని స్థానికుల రాస్తారోకో
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తాగునీటి కష్టాలను తీర్చాలని స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్-నాందేడ్ రహదారిపై బిందెలతో బైఠాయించి కమిషనర్ వెంటనే రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 32 వ వార్డులో ఉన్న చేతి పంపు సరిగా పనిచేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్​ను కాలనీ వాసులు నిలదీశారు. నీటి సమస్య వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. స్పందించిన కమిషనర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.మొత్తం మీద వేసవి ఆరంభంలోనే నీటి సమస్య ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.
Last Updated : Mar 16, 2019, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details