తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 38 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1091అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 85 టీఎంసీలకు చేరింది.. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో అడుగు దూరంలో మాత్రమే ఉండటంతో ప్రధాన కాలువల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలకు నీటి విడుదలతో పరివాహక ప్రాంతాల ప్రజలు, ఆయకట్టు రైతులను అధికారులు అప్రమత్తం చేశారు.
నిండుకుండలా మారిన ఎస్సారెస్పీ
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటిమట్టానికి మరో అడుగు దూరంలో మాత్రమే ఉండటం వల్ల అధికారులు ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు.
నిండుకుండలా మారిన ఎస్సారెస్పీ