తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల - శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్​ జలాశయం నుంచి యాసంది పంటల సాగుకోసం అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రధాన కాలువల ద్వారా వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నామని అధికారులు తెలిపారు.

water released from sriram sagar project
శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల

By

Published : Dec 25, 2019, 4:54 PM IST

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ జలాశయం నుంచి యాసంగి పంట సాగుకు కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ యాసంగిలో దిగువ మానేరు కింద 4 లక్షల ఎకరాలకు, సరస్వతి కాలువ కింద 35వేల ఎకరాలకు, లక్ష్మి, హన్మంత్​ రెడ్డి ఎత్తిపోతల పథకాల కింద 33 వేల ఎకరాలకు నీటిని విడుదల చేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. రైతులు పొదుపుగా వాడుకోవాలని... నీటిని కాలువల ద్వారా వారబందీ పద్ధతిలో (8 రోజుల విడుదల, 7 రోజుల నిలుపుదల) విడుదల చేయనున్నామని ప్రాజెక్టు ఈఈ రమేశ్​ తెలిపారు. ఏప్రిల్ 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని విడుదల చేయమని... కాలువల చివరన ఉన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

శ్రీరాంసాగర్​ నుంచి యాసంగికి నీరు విడుదల

ABOUT THE AUTHOR

...view details