వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. సింగీతం, కల్యాణి జలాశయాల నుంచి అలీసాగర్ ప్రాజెక్టులోకి 1,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు ఒక గేటు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డి-41 నుంచి డి-49 కాలువల ద్వారా మరో 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు.
అలీసాగర్ జలాశయం నుంచి నీటి విడుదల - flood water release from ali sagar
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశయం నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి చేరుతోంది.
అలీసాగర్ జలాశయం నుంచి నీటి విడుదల
శ్రీరాంసాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1086 అడుగులకు చేరుకుంది. 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కాగా... అవుట్ప్లో 863 క్యూసెక్కులు. ప్రాజెక్టులో ప్రస్తుతం 70 టీఎంసీల నీటినిల్వ ఉంది. మరో 20 టీఎంసీలు వస్తే జలాశయం నిండుతుంది.
ఇదీ చూడండి:మేడ్చల్ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు