నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి రేపు ఉదయం10 గంటలకు వరద కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అందువల్ల వరద కాలువ పరివాహక గ్రామాల ప్రజలు కాలువలోకి వెళ్లొద్దని కోరారు. ముఖ్యంగా గొర్రెలు, గేదెల కాపరులు, కెనాల్లో మోటార్లు గల రైతులు, చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం - srsp latest news
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు వరద కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాలువ పరివాహక గ్రామాల ప్రజలు కెనాల్లోకి వెళ్లొద్దని చెప్పారు.

srsp