నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారు. మోటారు చెడిపోయి మూడు రోజులుగా నీటి సరఫరా లేక నానా అవస్థలు పడుతున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలోనూ... వేసవిని తలపిస్తోందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని వివరణ కోరగా... మరమ్మతుకు ఇచ్చామని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
నీటి సరఫరాలేక హాస్టల్ విద్యార్థినిల అవస్థలు - armoor sc girls hostel
నీటి సరఫరా లేక ఆర్మూరు ఎస్సీ హాస్టల్లోని విద్యార్థినిలు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు, సిబ్బందికి చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సరఫరాలేక హాస్టల్ విద్యార్థినిల అవస్థలు