నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గత కొంత కాలంగా వస్తున్న వరద... ఉదయం నుంచి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,090.6 అడుగులు ఉంది. నాలుగు రోజులుగా 40 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉదయం నుంచి 16 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎస్సారెస్పీకి తగ్గిన వరద ప్రవాహం... 16 గేట్ల ద్వారా నీటి విడుదల
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,090.6 అడుగులు ఉంది. 16 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
SRSP
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 99,975 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31టీఎంసీలు కాగా ప్రస్తుతం 88 టీఎంసీలు ఉంది.
ఇదీ చదవండి :'పంటనష్టంపై సర్వే చేయించండి'