తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న త్రివేణి సంగమం - triveni sangamam at kandakurthy

ఎగువన కురుస్తున్న వర్షాలతో కందకుర్తి వద్ద త్రివేణి సంగమం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. దీనితో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WATER FLOOD AT KANDAKURTHY IN NIZAMABAD DIDTRICT
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న త్రివేణి సంగమం

By

Published : Sep 14, 2020, 2:51 PM IST

నిజామాబాద్ జిల్లా రెంజల్​ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రవాహంతో త్రివేణి సంగమం అయినటువంటి కందకుర్తి వద్ద గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి.

ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న త్రివేణి సంగమం

గోదావరిలోని శివాలయం నీట మునిగింది. శివుని తలపై గంగమ్మ చేరినట్టుగా అక్కడి ప్రదేశం చూపరులను ఆకట్టుకుంటుంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న త్రివేణి సంగమం

ABOUT THE AUTHOR

...view details