నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. శనివారం మండల కేంద్రం ఏర్గట్లతో పాటు తడ్‌పాకల్‌లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు.
గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తెరాసకు చెందిన వారుండాలని అన్నారు. అనంతరం గ్రామాల అభివృద్ధికి హామీ ఇచ్చిన మంత్రి...అభివృద్ధి కోసం తెరాసను గెలిపించాలని కోరారు.
'ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించాలి' - MINISTER VEMULA PRASHANTH REDDY
ప్రాదేశిక ఎన్నికల్లో తెరాసనే గెలిపించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లలో తెరాస సర్కారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
సంక్షేమాన్ని చూసి ఓటేయాలి : వేముల ప్రశాంత్ రెడ్డి
ఇవీ చూడండి : మంచినీటి ఏటీఎంలు.. నీళ్లు మాత్రం రావు..