ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు - villagers stopped sand tractors and protested
ప్రభుత్వ పనులకు అనుమతి తీసుకుని మిగతా పనులకు ఇసుకను తరలిస్తున్నారని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలాలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
![ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు villagers stopped sand tractors and protested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7301771-729-7301771-1590134086000.jpg)
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామంలోని కాలువ నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పనులకు అనుమతి తీసుకుని ఇతర పనులకు ఇసుకను తీసుకెళ్తున్నారని ఆందోళన చేశారు. ట్రాక్టర్లను అడ్డుకుని నిరసనకు దిగారు. వీఆర్ఏతో పాటు అధికారులు, దళారులతో కుమ్మక్కై ఇసుకను పక్కదారి పాటిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.