నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం షాపూర్ గ్రామ మహిళలు సాయిలు అనే వ్యక్తికి దేహశుద్ధి చేశారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సాయిలును మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదారు. నెలరోజుల నుంచి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరి మహిళలు, బాలికల పట్ల సాయిలు విచిత్రంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అదును కోసం వేచి ఉన్న గ్రామ మహిళలు సాయిలును పట్టుకొని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. సాయిలును అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఎస్సై శోభన్ బాబు తెలిపారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి - వ్యక్తికి దేహశుద్ధి
మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్లో చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఎస్సై శోభన్ తెలిపారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి