తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలపై అఘాయిత్యాలు అరికట్టే చట్టం తేవాలని మోదీకి చెబుతా' - Vijayawada youth padayatra to Delhi to meet prime minister narendra modi

దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ ఓ యువకుడు పాదయాత్ర చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నుంచి దిల్లీ వరకు చేపట్టిన ఈ యాత్రలో భాగంగా నిజామాబాద్​ చేరుకున్నాడు.

Vijayawada youth padayatra to Delhi to meet prime minister narendra modi
విజయవాడ నుంచి దిల్లీకి యువకుడి పాదయాత్ర

By

Published : Sep 3, 2020, 4:00 PM IST

దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టేలా ఓ కఠిన చట్టం తేవాలని ప్రధాని మోదీని కలిసి విన్నవిస్తానని ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఎన్​కేపాడుకు చెందిన నాగ అనే యువకుడు విజయవాడ నుంచి దిల్లీ వరకు పాదయాత్ర చేపట్టారు.

ఈనెల 17న ప్రారంభించిన ఈ యాత్రలో భాగంగా నాగ.. నిజామాబాద్​కు చేరుకున్నాడు. దిల్లీ నిర్భయ ఘటన తనను ఎంతో ఆలోచింపజేసిందన్న నాగ.. నేటి సమాజంలో మహిళల పట్ల చూపుతున్న వివక్ష, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసన వ్యక్తం చేశారు. సమాజంతో మార్పు కోసం తాను ముందడుగు వేశానని చెబుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details