మన ఆడబిడ్డ కవితను ఎంపీగా మళ్లీ గెలిపించే బాధ్యత అందరిపైన ఉందని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో తెరాస అభ్యర్థి కవిత తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. బీడి కార్మికులకు ఫించను ఇచ్చే ఆలోచన చేసింది కవిత అని తెలిపారు. ఇప్పుడు పసుపు రైతుల గురించి మాట్లాడుతున్న మాజీ ఎంపీ మధుయాస్కీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని విమర్శించారు. ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన అన్నదాతల గురించి ఎందుకు ఆలోచించలేదని మంత్రి వేముల ప్రశ్నించారు.
మన ఆడబిడ్డ కవితను గెలిపించాలి: వేముల - MADHUYASKI
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో తెరాస అభ్యర్థి కవిత తరఫున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఆడబిడ్డ కవితను గెలిపించే బాధ్యత మనదని సూచించారు. కాంగ్రెస్ హయాంలో పసుపు రైతుల గురించి ఎందుకు ఆలోచించలేదని మాజీ ఎంపీ మధుయాస్కీని నిలదీశారు.
ప్రచారంలో మంత్రి వేముల