తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో వ్యక్తి మృతి! జేసీబీ సాయంతో అంత్యక్రియలు... - one died of fever in nandipet

నిజామాబాద్​ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ వ్యక్తి జ్వరంతో మృతి చెందాడు. కరోనాతో మృతి చెంది ఉంటాడని గ్రామస్థులు ట్రాక్టర్​ ట్రాలీలో మృతదేహాన్ని తరలించి, జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు.

one died of corona in nizamabad
నిజామాబాద్​ జిల్లాలో జ్వరంతో వ్యక్తి మృతి

By

Published : Aug 20, 2020, 3:49 PM IST

నిజామాబాద్​ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ వ్యక్తి జ్వరంతో మృతి చెందాడు. మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న జంగం గురువయ్య కరోనా పరీక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. భారీగా జనం రావడం వల్ల గురువయ్య పరీక్ష చేయించుకోకుండానే ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

మార్గమధ్యలోనే మృతి చెందిన గురువయ్య... కరోనాతోనే మరణించి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ పెద్ద గంగారాం ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది గురువయ్య మృతదేహాన్ని ట్రాక్టర్ ట్రాలీలో ఊరి చివరకు తరలించారు. జేసీబీతో గుంత తీసి అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details