తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా కష్టం కరోనాపాలైంది'

వేసవి వచ్చిదంటే కూరగాయల ధరలు ఆకాశాన్నంటేవి. వందల కొద్దీ జరిగే వివాహ వేడుకలతో కాయగూరలకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. కరోనా రాకతో ముహూర్తాలన్నీ వాయిదా పడటంతో వినియోగం లేక ధరలు నేలవాలాయి.

nizamabad district latest news
nizamabad district latest news

By

Published : May 6, 2020, 3:33 PM IST

లాక్‌డౌన్‌ అమల్లోకి రాగానే ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతిని నిలిపివేయడం వల్ల స్థానికంగా పండే వాటికైనా మంచి ధర లభిస్తుందని రైతులు ఆశించారు. కానీ జనాలు లేక మార్కెట్లు బోసిపోవడంతో కొనే వారే లేక రోడ్ల వెంబడి పారబోసే పరిస్థితి వచ్చింది. మా కష్టం కరోనాపాలైందని నిజామాబాద్​ రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

జిల్లా నలుమూలల నుంచి కూరగాయలను వినియోగదారుల చెంతకు చేర్చే నిజామాబాద్‌ శ్రద్ధానంద్‌ గంజ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు నిత్యం 1- 1.20 లక్షల కిలోల కూరగాయలు, ఆకుకూరలు వచ్చేవి. లాక్‌డౌన్‌ కారణంగా వారంలో మూడే రోజులు మార్కెట్‌ తెరుస్తున్నారు. అయినా దాదాపు అంతే సరకు వస్తోంది. మంగళవారం 1,18,950 కిలోల పంట వచ్చింది. ఇదంతా జిల్లా రైతులు తెచ్చిందే.

కను‘విందు’ లేదు...

అన్ని రోజుల్లోనూ హోటళ్లు కిటకిటలాడుతుండేవి. నగరంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో వంద వరకు నిత్యం రద్దీతో ఉండేవి. ఒక్కో దాంట్లో రోజుకు కనీసం వంద మందిని వేసుకున్నా పది వేల మందికి అవసరమైన సరకులు వినియోగించేవారు. లాక్‌డౌన్‌తో ఇవన్నీ మూతపడ్డాయి. మరోవైపు మంచి ముహూర్తాలు ఉండే వేసవికాలంలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు తదితర వేడుకల్లో వేల మందికి భోజనాలు సిద్ధం చేసేవారు. ఇప్పుడివన్నీ కనుమరుగయ్యాయి. ఫలితంగా కూరగాయలు, ఆకుకూరల వినియోగంపై తీవ్ర ప్రభావం పడింది.

కొనాలన్నా కొవిడ్‌ భయం...

చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారు పనుల్లేక వీధుల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నారు. పట్టణాల నుంచి వ్యాపారులు రాకపోవడం వల్ల రైతులే మార్కెట్లో కూర్చొని అమ్ముతున్నారు. ఇంత చేస్తున్నా కొనేవారు కరవయ్యారు. కరోనా వైరస్‌ ఎక్కడ.. ఎవరి చేతుల నుంచి సోకుతుందోనని భయపడుతున్నారు. పేదలు, రోజువారీ కూలీల చేతిలో చిల్లిగవ్వ లేక ఖర్చుకు వెనకాడుతున్నారు.

కూలీల ఖర్చులు కూడా పూడటం లేదు...

ఎకరంన్నర పొలంలో టొమాటో పండిస్తే కనీసం పెట్టుబడులు దక్కలేదు. మార్కెట్లో ధర లేక కోసిన కూలీల ఖర్చులు కూడా రాలేదు. ఈ సమయంలో కిలో టొమాటో రూ.20 పలికేది. వినియోగం లేక రూ.10లోపే ఉంది. పంట నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల వచ్చిన కాడికి అమ్ముకుంటున్నాం. ఆకుకూరలు, కూరగాయలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

- కోమన్‌పల్లి రాజన్న, రైతు, వెల్మల్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details