నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దాదన్నగారి విఠల్ పాల్గొన్నారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయని... చెడును దరికిరానివ్వకుండా మంచి మార్గంలో నడిచేవారు మహర్షులవుతారని కలెక్టర్ పేర్కొన్నారు. వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు - జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్రావు
వాల్మీకి జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు పాల్గొన్నారు.
![ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4742189-867-4742189-1570981365512.jpg)
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు