కల్వర్టును ఢీకొని లారీ బోల్తా... ఒకరు మృతి - high way
గుర్తు తెలియని వాహనం అడ్డువచ్చి లారీ అదుపు తప్పింది. కల్వర్టును ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకురు తీవ్ర గాయాలపాలయ్యారు.
లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సీఎంసీ మెడికల్ కాలేజీ వద్ద ప్రమాదం జరిగింది. ఎన్.హెచ్ 44 జాతీయ రహదారిపై నాగపూర్ వైపు వెళ్తున్న లారీకి గుర్తుతెలియని వాహనం అడ్డు వచ్చింది. దీంతో లారీ అదుపుతప్పి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.