ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు చవిచూశాం. కొన్ని సంఘటనలు చూశాక చాలా భయమేసింది. బాంబుల మోతతో కీవ్ నగరం దద్ధరిల్లింది. మా అపార్ట్‌మెంట్‌కు 7 వందల మీటర్ల దూరంలో కాల్పులు జరిగాయి. పేలుడు శబ్ధాలతో భయాందోళనకు గురయ్యాం. అపార్ట్‌మెంట్ కింద బంకర్‌లో తలదాచుకున్నాం. ముందే కొంతమేరకు నిత్యావసరాలు తెచ్చుకున్నాం. తర్వాత ఐదు రోజులు నీళ్లు తాగే గడిపాం. నేను ఉండే చోట చాలా మంది భారతీయులు ఉన్నారు. సరిహద్దుల్లోకి రావాలని సమాచారం ఇచ్చారు. ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. యూనివర్శిటీ వాళ్లు కూడా అంచనా వేయలేకపోయారు.
'ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు చవిచూశాం.. బాంబుల మోతతో కీవ్ దద్ధరిల్లింది' - రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
Ukrain Return Student Interview: బాంబుల వర్షం.. క్షిపణుల మోత.. బయటకు వస్తే బతుకుతామో లేదోనన్న భయం.. అక్కడే ఉంటే ప్రాణాలతో బయటపడతామో లేమోనన్న ఆందోళన.. బిక్కుబిక్కుమంటూ.. భయం భయంగా గడిపారు భారత విద్యార్థులు. భారత ప్రభుత్వం చూపిస్తున్న చొరవతో వైద్య విద్యనభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు ఒక్కొక్కరుగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. పిల్లలు క్షేమంగా రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోతున్నారు. నిజామాబాద్‌కు చెందిన చైతాలి ఇవాళే ఇంటికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం.. తనకు ఎదురైన పరిస్థితులను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
'ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు చవిచూశాం.. బాంబుల మోతతో కీవ్ దద్ధరిల్లింది'
-చైతాలి, ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి
ఇదీ చదవండి: