నగదు మార్పిడి కేంద్రంలో జిరాక్స్ తీసిన నోట్లు ఇచ్చి చెల్లుబాటయ్యే కరెన్సీ తీసుకొని పరారైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
ఓ పథకం ప్రకారం మోసం
ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై నవీపేటలోని ‘హనుమాన్ మీ-సేవ’ కేంద్రానికి(ఖాతాదారుల కేంద్రం) వచ్చారు. షకీల్ అనే వ్యక్తి కేంద్రంలోకి వెళ్లగా తోడుగా వచ్చిన వ్యక్తి బయటే వాహనంపై ఉన్నాడు. యూఏఈ దేశానికి చెందిన 4,800 దిర్హమ్స్(కరెన్సీ) అసలైనవి తీసుకొచ్చి డబ్బు మార్పిడి చేసి ఇవ్వాలని (స్వదేశీ కరెన్సీ) ఆపరేటర్ రేఖకు అందించాడు. వాటిని ఆమె తీసుకొని పరిశీలించి రూ.88,800 వస్తాయని చెప్పారు... చాలా తక్కువ ఇస్తున్నారని ఆపరేటర్‌తో వాగ్వాదానికి దిగి ఇచ్చిన నోట్లు వాపసు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి కనీసం రూ.89 వేలు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె సమ్మతించారు. రెండోసారి వచ్చిన షకీల్ అసలైన దిర్హమ్స్ కరెన్సీకి బదులుగా వాటి నకలు నోట్లను ఓ పర్సులో పెట్టి ఇచ్చాడు. ఇది వరకు ఇచ్చిన సరైన దిర్హమ్స్‌నే సదరు వ్యక్తి మళ్లీ ఇచ్చాడని భావించిన ఆమె రూ.89 వేల నగదు ఇచ్చారు.