తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు.. మృతి - Two year old boy Dies into water tank at Maddul thanda

అభంశుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టే బాలుడి పాలిట యామపాశంగా మారింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందటం వల్ల దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Two-year-old boy Dies into water tank at Maddul thanda in Nizamabad district
నీటి తొట్టెలో పడి రెండేళ్ల బాలుడు మృతి

By

Published : Jun 23, 2020, 7:47 PM IST

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మద్దూల్ తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన మెగావత్ మీట్యా కుమారుడు మనోహర్​ ఆడుకుంటూ ఇంటి ముందు భాగంలో ఉన్న నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఇంటి అవసరాల కోసం ముందుభాగంలో మూడు సిమెంటు రింగులతో నీటి తొట్టి నిర్మించుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం వాకిట్లో మొరం వేసి చదును చేశారు. దీనివల్ల దాని ఎత్తు అమాంతం తగ్గి ప్రమాదకరంగా మారింది.

బాలుని ఇంటి వద్ద వదిలి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఈ సమయంలో బాలుడు నీటి తొట్టిలో పడిన గ్లాసును తీసుకోబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి ఊపిరాడక మృతి చెందాడు. ఆలస్యంగా గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందటం వల్ల దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details