తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు మినీలారీల రేషన్​ బియ్యం స్వాధీనం - nizamabad latest news

నిజామాబాద్ నగరం నుంచి భారీ ఎత్తున రెండు వాహనాల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న రేషన్​ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

two lorries of ration rice seized in nizamabad
రెండు మినీలారీల రేషన్​ బియ్యం స్వాధీనం

By

Published : Jul 28, 2020, 1:55 PM IST

నిజామాబాద్​ జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంకాలనీ రోడ్​లో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద రేషన్​ బియ్యం నింపుకొని రవాణాకు సిద్ధంగా ఉన్న 2 అశోక్ లేలాండ్( డ్రాస్టార్) వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్టు టాస్క్​ఫోర్స్ పోలీసులు సిబ్బంది తెలిపారు.

రెండు వాహనాలతో పాటు, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ జలాలుద్దీన్​తో పాటు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ మొహమ్మద్ సల్మాన్​లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details