నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలోని మామిడిపల్లికి చెందిన రాజు ఇంట్లో రూ.2 లక్షల నగదును ఓ ఆగంతకుడు చోరీ చేశాడు. తెల్లవారుజామున తల్లి అంజవ్వ పొలం పనులకు వెళ్లగా... రాజు పని నిమిత్తం ఆర్మూర్‌కు వెళ్లాడు. అతని భార్య... పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా... ఒక తలుపు తెరిచి ఉంది.
ఆర్మూర్‌లో పట్టపగలే చోరీ... రూ. 2 లక్షల అపహరణ - nizamabad crime news
పట్టపగలే దొంగతనం జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది. రూ. 2 లక్షల నగదును దొంగ అపహరించుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆర్మూర్‌లో పట్టపగలే చోరీ... రూ. 2 లక్షల అపహరణ
ఇంట్లోని బీరువా తెరిచి అందులో ఉన్న రూ.2లక్షల నగదును దోచుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై రాగా... బంధువేమో అనుకుని చుట్టుపక్కల వాళ్లు అంతగా పట్టించుకోలేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య లావణ్య పుట్టింటికి వెళ్లే ముందు 11తులాల బంగారు ఆభరణాలు డబ్బాలో దాచడం వల్ల భద్రంగా మిగిలిపోయింది. లేదంటే దొంగ పాలయ్యేది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.