సాధారణంగా చెరువులో ఐదు నుంచి పది కిలోల వరకు బరువు ఉన్న చేపలు పెరుగుతాయి. కానీ మత్స్యకారులకు ఈ రోజు కాసుల పంట పండింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణా కలాన్ శివారులోని అలీసాగర్ జలాశయానికి శనివారం.. మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లారు. అక్కడ వారి వలకు 25 కిలోల చేప చిక్కింది. ఇది బొచ్చ రకానికి చెందినదని చెప్పారు. ఇలాంటివి అరుదుగా దొరుకుతాయని పేర్కొన్నారు.
Big fish: 25 కిలోల అరుదైన చేప.. ఎక్కడో తెలుసా.! - 25 kgs fish news
నిజామాబాద్ జిల్లా అలీసాగర్ జలాశయానికి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం బొచ్చ చేప రూపంలో చేరింది. వారి వలకు భారీ చేప చిక్కింది. ఈ చేప బరువు 25 కిలోలు తూగడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
![Big fish: 25 కిలోల అరుదైన చేప.. ఎక్కడో తెలుసా.! 25kgs fish](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12350595-600-12350595-1625380041641.jpg)
25 కిలోల చేప
ఈ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. భారీ చేప దొరకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:PUBLIC DEMAND: స్విమ్మింగ్ పూల్ వద్దు.. వాకింగ్ ట్రాక్ కావాలి..