తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​కు పసుపు తరలింపు

పంట కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పసుపును నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తరలించారు. రెండు నెలలు కొనుగోళ్లు ఆలస్యమైన నేపథ్యంలో తమకు మద్దతు ధర ఇవ్వాల్సిందేనని రైతులు కోరుతున్నారు.

మద్దతు ధర ఇవ్వాల్సిందే : పసుపు రైతులు
మద్దతు ధర ఇవ్వాల్సిందే : పసుపు రైతులు

By

Published : May 26, 2020, 3:39 PM IST

లాక్​డౌన్​ అమలుతో కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు 60 రోజులు అనంతరం కొనుగోళ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల పసుపు రైతులు పంటను తీసుకుని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట బారులు తీరుతున్నారు.

మద్దతు ధర ఇస్తే చాలు...

అప్పులు తెచ్చి పంటను సాగు చేస్తే తీరా అమ్ముకునే సమయంలో లాక్​డౌన్ వల్ల రెండు నెలలు ఆలస్యంగా పంటను మార్కెట్​కు తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. పసుపు పంటను అకాల వర్షాల నుంచి రెండు నెలలు కాపాడుకున్నామన్నారు. ఆలస్యమైనప్పటికీ క్వింటాలుకు రూ.8 నుంచి 10 వేల మద్దతు ధర లభిస్తే చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పంట అమ్మకం ఆలస్యమవడం వల్ల పెట్టుబడికి తెచ్చిన అప్పులకు అదనంగా రెండు నెలలు వడ్డీ కట్టాల్సి వస్తుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : 'నచ్చిన పంట సాగు చేసుకునే స్వేచ్ఛ రైతులకు లేదా?'

ABOUT THE AUTHOR

...view details