నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సాలోమాన్. జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 డిపోల పరిధిలో 644 బస్సులుండగా... 272 బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సుల వల్ల ప్రతి రోజు ఆర్టీసీకి 80 లక్షల వరుకు ఆదాయం వస్తుండేది. సమ్మెతో నష్టమైనా ప్రయాణీకుల సౌకర్యార్థం బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేమేజర్ వివరించారు. ఇప్పటికే చాల మందిని తాత్కలిక పద్ధతిలో నియమించామని, సాయంత్రం లోపు ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో 664 బస్సులను నడుపుతామని సోలోమాన్ పేర్కొన్నారు.
'సాయంత్రంలోపు 664 బస్సులను నడుపుతాం' - TSRTC SAMME
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. సాయంత్రంలోపూ 664 బస్సులను నడుపుతామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సాలోమాన్ తెలిపారు.

'సాయంత్రంలోపు 664 బస్సులను నడుపుతాం'