TSRTC Notices to Jeevan Reddy Mall : తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో భాగంగానే తొలి రోజే ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించింది. ప్రమాణ స్వీకారం జరిగిన రోజే మంత్రివర్గాన్ని రేవంత్ రెడ్డిసమావేశపర్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కేబినెట్ భేటీ జరిపారు. విద్యుత్ అంశంపైనా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చ జరిగింది. తెలంగాణలో కరెంట్ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సర్కార్ చేసిన అనేక తప్పిదాలతో తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిందని చెప్పారు. వాస్తవ పరిస్థితిని ఎందుకు దాస్తున్నారంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్రంగా సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
రేపటి నుంచి శాసనసభ సమావేశాలు - నేడు విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
ఓ షాపింగ్ మాల్ స్థలం అద్దె, కరెంట్బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత సంస్థలు చర్యలకు దిగాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. స్థానిక బస్టాండ్‌ను ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7,000 చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది.
హామీల అమలుపై కొత్త సర్కార్ ఫోకస్ - రేపటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం