నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు తాత్కాలికంగా పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు గులాబీ పూలు ఇచ్చి రేపటి నుంచి విధులకు హాజరు కావద్దని కోరారు. బోధన్ బస్టాండ్‌కు వచ్చిన మహారాష్ట్ర బస్సు డ్రైవర్‌కు పూలిచ్చి తమకు సంఘీభావం తెలపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
తాత్కాలిక ఉద్యోగుల మద్దతు కోరిన ఆర్టీసీ కార్మికులు - tsrtc employees strike in nizamabad
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ కార్మికులు పూలిచ్చి తాము 17 రోజులుగా చేస్తున్న సమ్మెకు సహకరించాలని కోరారు.
తాత్కాలిక ఉద్యోగుల మద్దతు కోరిన ఆర్టీసీ కార్మికులు