నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో ఈ రోజు మృతి చెందాడు. ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామానికి చెందిన రాజేందర్ బోధన్ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. నిన్న ఉదయం గుండెనొప్పితో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. 50 రోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి - గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు.
గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి