నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రంలోని బస్టాండు నుంచి బాన్సువాడకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు.. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సిగ్నల్ గమనించక అక్కడే ఆగి ఉన్న మరో ఆర్టీసీ బస్సును క్రాస్ చేస్తూ ముందుకు వెళ్ళింది. ఆగి ఉన్న బస్సుకు వెనక ఉన్న మరో బస్సు తగలడం వల్ల ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బస్సును అక్కడి నుంచి పంపేశారు. ఎలాంటి హానీ జరగకపోవడం వల్ల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్షం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు తెలిపారు.
త్రుటిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం - త్రుటిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్‌ని గమనించికుండా వెళ్లిన ఓ ఆర్టీసీ బస్సు వల్ల వేరే బస్సుకు ప్రమాదం జరిగింది. కానీ బస్సులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

త్రుటిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
త్రుటిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో ఏఎస్సై ఆత్మహత్యాయత్నం... ఎందుకు?