ఉద్యోగ భద్రత సర్క్యులర్.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల పాలిట శాపంగా మారిందని ఆర్టీసీ ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకట్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగ భద్రత కొత్త సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని వెంకట్ డిమాండ్ చేశారు.
'ఉద్యోగ భద్రత సర్క్యులర్.. ఆర్టీసీ కార్మికుల పాలిట శాపం' - ఆర్టీసీ ఏఐటీయూసీ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగ భద్రత కొత్త సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
!['ఉద్యోగ భద్రత సర్క్యులర్.. ఆర్టీసీ కార్మికుల పాలిట శాపం' tsrtc aituc demands immediate withdrawal of new job security circular](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11041667-759-11041667-1615962639002.jpg)
'ఉద్యోగ భద్రత సర్క్యులర్.. ఆర్టీసీ కార్మికుల పాలిట శాపం'
కార్మికులకు.. సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదం కేసులో.. కోర్టు, విచారణ పూర్తి చేసేవరకు కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగించకూడదని కోరారు.