తెలంగాణ

telangana

ETV Bharat / state

తీన్మార్ మల్లన్నపై 'తెరాస' దాడి.. ఖండించిన నారాయణ - Teenmar Mallanna in Indalwai latest News

నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలంలో తీన్మార్ మల్లన్నను తెరాస కార్యకర్తలు ఘోరావ్ చేశారు. అనంతరం ఆయన వాహనంపై రాళ్లు రువ్వి అలజడి సృష్టించారు.

తీన్మార్ మల్లన్నపై తెరాస కార్యకర్తల దాడులు.. కారు ధ్వంసం
తీన్మార్ మల్లన్నపై తెరాస కార్యకర్తల దాడులు.. కారు ధ్వంసం

By

Published : Jul 12, 2020, 5:51 PM IST

Updated : Jul 12, 2020, 6:08 PM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయిలోని టోల్ ప్లాజా వద్ద తీన్మార్ ఫేమ్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్​ను తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. అనంతరం మల్లన్న కారుపై రాళ్లు రువ్వారు. ఆర్మూర్ స్టేషన్​లో ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆర్మూర్​ తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లన్న కారును ముట్టడించారు. అనంతరం నిరసనలు తెలిపారు. స్పందించిన పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఇందల్​వాయి పోలీస్ స్టేషన్​లో బాధితుడి వాంగ్మూలం రికార్డు చేసి హైదరాబాద్ పంపించారు.

హేయమైన చర్య : నారాయణ

తీన్మార్‌ మల్లన్నపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. తెలంగాణలో తెరాస వ్యతిరేక గొంతులను బతకనివ్వరా అని ప్రశ్నించారు. సాక్షాత్తు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్​రెడ్డి హైదరాబాద్‌లో ఉండగానే శాంతి భద్రతల సమస్య ఏ దుస్థితిలో ఉందో గమనించాలని కోరారు.

తీన్మార్ మల్లన్నపై తెరాస కార్యకర్తల దాడులు.. కారు ధ్వంసం

ఇవీ చూడండి : ఎస్‌ఆర్ఎస్​పీ వరదకాల్వ ఎగువన నీటి ఇబ్బందులపై సీఎం సమీక్ష

Last Updated : Jul 12, 2020, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details