తెలంగాణ

telangana

ETV Bharat / state

'కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి' - ఎంపీ సురేష్‌ రెడ్డి వార్తలు

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణానది జల వివాదాల పరిష్కారం కోసం పూర్తి అధికారులతో కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని రాజ్యసభలో తెరాస ఎంపీ సురేష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో కృష్ణా జలాల వివాదంపై ప్రస్తావించారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ సురేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

mp suresh reddy
mp suresh reddy

By

Published : Sep 15, 2020, 10:15 AM IST

రాజ్యసభ జీరో అవర్‌లో కృష్ణా జలాల వివాదంపై తెరాస ఎంపీ సురేశ్‌రెడ్డి ప్రస్తావించారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్​ ఆరేళ్లుగా కేంద్రానికి అనేక లేఖలు రాశారని సురేశ్‌రెడ్డి వెల్లడించారు.

బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌ను కొంతకాలం పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారని... దీనివల్ల వివాదాలు పూర్తిగా పరిష్కారం కావడం లేదన్నారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ సురేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

'కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి'

ఇదీ చదవండి:తాను వాడే మాస్కులపై కేటీఆర్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details