ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కవిత. కేంద్రంలో కాంగ్రెస్, భాజపా లేకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పెర్కిట్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల కోసం ఆగం చేయడానికి కొందరు వస్తారని.. వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు.
కాంగ్రెస్, భాజపా లేకుంటేనే అభివృద్ధి: కవిత - కవిత ప్రచారం
గతంలో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన వాళ్లు ఏవిధంగా పనిచేశారో.. ఐదేళ్లలో నేను ఎలా పనిచేశానో చూసి ఓటేయండి. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశా. ---- పెర్కిట్ రోడ్‌షోలో కవిత

తెరాస ఎంపీ కవిత
నల్లధనాన్ని తీసుకొచ్చి అందరి ఖాతాలో 15 లక్షల చొప్పున జమ చేస్తానని చెప్పిన మోదీ.. మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు, కేసీఆర్‌కు మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగవని హెచ్చరించారు. శాసనసభ ఎన్నికల్లో తెరాసను ఏ విధంగానైతే ఆదరించారో... లోక్‌సభ ఎన్నికల్లో తనతో పాటు 15 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కవిత ఎన్నికల ప్రచారం
ఇదీ చదవండి :నేడు ఓరుగల్లులో కేసీఆర్ బహిరంగ సభ
Last Updated : Apr 2, 2019, 7:18 AM IST