నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్లమెంట్ ఎన్నికల ముందు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి.. ఇప్పుడు మాట మార్చారని తెరాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి ఆరోపించారు. రైతులు కోరుకున్నది సుగంధద్రవ్యాల బోర్డు కాదని.. పసుపు బోర్డు అనే విషయాన్ని ఎంపీ అర్వింద్ గుర్తించాలన్నారు.
'పసుపు బోర్డు తెస్తామని భాజపా ప్రజలను మోసం చేసింది' - నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై మండిపడ్డ తెరాస జిల్లా అధ్యక్షుడు
పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికలకు ముందు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి.. ఇప్పుడు సుగంధ ద్రవ్యాల బోర్డును తీసుకొచ్చి భాజపా ప్రజలను మోసం చేసిందన్నారు.
!['పసుపు బోర్డు తెస్తామని భాజపా ప్రజలను మోసం చేసింది' http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/09-February-2020/6015697_vratam_vysh.mp4](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6015697-thumbnail-3x2-trs.jpg)
'భాజపా పసుపు బోర్డు తెస్తామని ప్రజలను మోసం చేసింది'
మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ పసుపు బోర్డు తెస్తామని ప్రజలను నమ్మించి.. సుగంధద్రవ్యాల బోర్డు తీసుకువచ్చారని.. ఇందుకు ఎంపీ అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
'భాజపా పసుపు బోర్డు తెస్తామని ప్రజలను మోసం చేసింది'
ఇవీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం