తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస నేతల విజయెత్సవ సంబురాలు - ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సురభి వాణీదేవిని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రజానికం తమ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిందని నిజామాబాద్​ నగర మేయర్​ నీతూ కిరణ్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపొందిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్పొరెషన్ కార్యాలయం ఎదుట సంబురాలు చేశారు.

trs leaders celebrations for winning in mlc election
తెరాస నేతల విజయెత్సవ సంబురాలు

By

Published : Mar 20, 2021, 11:13 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టభద్రులు కేసీఆర్​ నాయకత్వాన్ని బలపరిచారని నిజామాబాద్​ నగర మేయర్​ నీతూ కిరణ్​ అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో సురభి వాణీదేవి గెలుపొందిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సంబురాలు చేశారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచారు.

సురభి వాణీదేవిని ఎన్నుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటిచెప్పారని నీతూ కిరణ్​ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతీ పట్టభద్రుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్​ అర్బన్​ డెవలప్​మెంట్ అథారిటీ ఛైర్మన్​ ప్రభాకర్​ రెడ్డి, ఐడీసీఎమ్​ఎస్​ ఛైర్మన్​ సాంబారు మోహన్​ తదితరులు పాల్గొన్నారు. ​

ఇదీ చదవండి:ఆమె విజయం ఓ చారిత్రక సందర్భం: కేవీ రమణాచారి

ABOUT THE AUTHOR

...view details