తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా జెండాను విరగ్గొట్టిన తెరాస కార్యకర్త.. కేసు నమోదు - వర్నిలో భాజపా జెండాను విరగ్గొట్టిన తెరాస కార్యకర్తలు

రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా జెండాపైనే తన ప్రతాపం చూపించాడు ఓ వ్యక్తి. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో తెరాస కార్యకర్త భాజపా జెండాను విరగ్గొట్టగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

bjp flag collapsed by trs leader
వర్ని మండలం కేంద్రంలో భాజపా జెండాను విరగ్గొట్టిన తెారాస కార్యకర్త

By

Published : Apr 10, 2021, 4:37 PM IST

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కేంద్రంలో భాజపా జెండాను విరగ్గొట్టిన తెారాస కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి జెండాను తొలగిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

వర్ని మండలం కేంద్రంలో భాజపా జెండాను విరగ్గొట్టిన తెారాస కార్యకర్త

ఈ సంఘటనతో భాజపా నాయకులకు, తెరాస కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:తాటి చెట్టు నుంచి కల్లును దించి.. మొక్కులు చెల్లించి..

ABOUT THE AUTHOR

...view details