తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం భూమి లాక్కుంటుందంటూ.. గిరిజనుల ధర్నా! - మహబూబాబాద్​ జిల్లా వార్తలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీ సమీపంలో గల గిరిజనుల భూమిని విశ్రాంతి భవనం, చేపల మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని గిరిజనులు, పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మా భూమి మాక్కావాలంటూ.. ప్రభుత్వ దౌర్జన్యం నశించాలంటూ.. నినాదాలు చేశారు.

Tribal People Protest For Land in Mahhabubabad District
ప్రభుత్వం భూమి లాక్కుంటుందంటూ.. గిరిజనుల ధర్నా!

By

Published : Aug 6, 2020, 9:00 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో సర్వే నెంబర్​ 551/888/4 లో ఎకరం 20 గుంటల భూమిని 1965లో, మూడెకరాల 20 గుంటల భూమిని 1971లో గ్రామానికి చెందిన బట్టు కిషన్​ కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఆ భూమిని 1978లో అటవీ శాఖకు అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి వారు సరిగ్గా అద్దె కట్టకపోవడం, ఖాళీ చేయకపోవడం వల్ల విసుగు చెందన భూ యజమానులు కోర్టును ఆశ్రయించారు. ఆగ్రహించిన కోర్టు డిక్రీ ద్వారా ఆ స్థలాన్ని ఖాళీ చేయించారు.

2013లో హైకోర్టు గిరిజనులైన భూ యజమానులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. వాటి ప్రకారం అప్పటి ఎమ్మార్వో, సర్వేయర్​లు పరిశీలించి హద్దులు నిర్ణయించారు. ఆ తర్వాత భూ యజమానులు లేని సమయంలో ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ విశ్రాంతి గృహం, చేపల మార్కెట్​ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు శంఖుస్థాపన కూడా జరిగింది. ఆ భూమి తమకే చెందుతుందని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వాధికారులు అన్యాయంగా తమ భూములు లాక్కోవడం సరికాదని గిరిజనులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న గిరిజనులకు సీపీఎం, కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్​ నాయకులు సంఘీభావం పలికారు.

ఇదీ చూడండి :ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details