నిజామాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
'ఇప్పుడు నార్మల్‌గానే చెప్తున్నాం... తర్వాత మాత్రం ఇలా ఉండదు' - మాస్క్‌పై అవగాహన కార్యక్రమాలు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో... ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు.
'ఇప్పుడు నార్మల్‌గానే చెప్తున్నాం... తర్వాత మాత్రం ఇలా ఉండదు'
మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు మాస్క్ ధరించాలంటూ అవగాహన కల్పించారు. ఐదు రోజుల అవగాహన కార్యక్రమాల అనంతరం తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:మీరూ ‘కరోనాసోమియా’తో బాధపడుతున్నారా?