పర్యాటక ప్రాంతాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు వివరించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ సందర్శన ప్రదేశాల వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయని.. వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ సూచించారు.
ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు - Tourism Day Celebrations in great way in nizamabad
నిజామాబాద్‌లో ప్రంపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఎంఆర్ఎం రావు దంపతులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ ప్రదేశాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
Tourism Day Celebrations in great way in nizamabad