తెలంగాణ

telangana

ETV Bharat / state

'మారుమాల ప్రాంత విద్యార్థుల ప్రతిభ గుర్తించడమే లక్ష్యం' - REGIONAL COORDINATOR SINDHU

సాంఘిక సంక్షేమ గురుకులాల ఆధ్యర్యంలో రీజనల్ స్థాయి విద్యార్థులకు హల్ చల్ పోటీలు నిర్వహించారు. మారుమూల ప్రాంతాల చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా స్వారోస్ సర్కిల్ అనే కార్యక్రమాన్ని ఏర్పరిచామని ప్రాంతీయ సమన్వయ అధికారిణి సింధు తెలిపారు.

పోటీ తత్వాన్ని ఏర్పరచడం కోసమే ఈ కార్యక్రమం

By

Published : Apr 21, 2019, 6:59 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో రీజనల్ స్థాయి చిన్నారుల హల్ చల్ పోటీలను ప్రాంతీయ సమన్వయ అధికారిణి సింధు ప్రారంభించారు. గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వారోస్ సర్కిల్ అనే కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు.

'నైపుణ్యం వెలికితీత కోసమే స్వారోస్ సర్కిల్'

వారిలోని నైపుణ్యం వెలికితీతతో పాటు పోటీ తత్వాన్ని ఏర్పరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 నుంచి 9వ తరగతి వరకు 190 మంది స్వారోస్ చిన్నారులకు పరుగు పందెం, క్విజ్ , ఉపన్యాసం , జనరల్ నాలెడ్జ్, పాటల పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

సాంఘిక సంక్షేమ గురుకులాల ఆధ్యర్యంలో విద్యార్థులకు హల్ చల్ పోటీలు

ఇవీ చూడండి : ప్రగతిభవన్​ ముట్టడి యత్నం, కార్యకర్తల అరెస్ట్


ABOUT THE AUTHOR

...view details