పార్టీ టికెట్లను డబ్బులు పెట్టి కొనుక్కొని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కాకుండా పని చేసే వారికి ఓట్లేయాలని తెజాస అధ్యక్షుడు కోదండరాం సూచించారు. అభివృద్ధి గురించి జరగాల్సిన చర్చ.. అభ్యర్థుల టికెట్ల కొనుగోలు గురించి జరగడం విచారకరమన్నారు.
'అభివృద్ధి చేసే నేతలకే ఓటేద్దాం...' - అభివృద్ధికి ఓటేద్దాం...
డబ్బులు పెట్టి టికెట్లు కొనే నేతలకు ఓటేస్తే.. ఆస్తుల కోసం తప్ప ప్రజల కోసం పని చేయరని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరాం నిజామాబాద్లో పేర్కొన్నారు.
అభివృద్ధికి ఓటేద్దాం...
నిజామాబాద్ నగరంలో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పేరుతో రోడ్లు విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు