గోడ కూలి ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు - గోడ కూలి ఇద్దరు మృతి

08:24 May 22
గోడ కూలి ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తుండగా... అకస్మాత్తుగా గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బోధన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో తల్లి లక్ష్మి, తండ్రి శ్రీనివాస్, కుమారుడు సాయి మృతి చెందగా... ముగ్గురు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.