తెలంగాణ

telangana

ETV Bharat / state

వారం రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - కరోనా వార్తలు

వారం రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో కలకలం రేపింది. వీళ్లు కరోనాతో చనిపోయారా లేక ఇంకేమైనా కారణాలున్నాయో తెలియటం లేదు.

deaths
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

By

Published : Apr 16, 2021, 3:00 PM IST

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో విషాదం జరిగింది. వారం రోజుల్లో తల్లిదండ్రులు, కుమారుడు మృతి చెందారు. ఈనెల 6న ఊపిరితిత్తుల వ్యాధితో విశాఖలో కుమారుడు రమేశ్(42) మృతి చెందారు. పడకంటి రమేశ్ మృతదేహం తీసుకొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.

మరోవైపు నిన్న రమేశ్ తల్లి కరెవ్వ మృతి చెందగా.. ఇవాళ తండ్రి లింబయ్య(65) మృతి చెందాడు. కొవిడ్ పరీక్షల్లో దంపతులకు నెగెటివ్ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణుల సూచించారు.

ఇదీ చదవండి:రెచ్చిపోతున్న ఇసుక మాఫియా... అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి

ABOUT THE AUTHOR

...view details