తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇలాంటి పని ఎవ్వరూ చేయరు.. మాకు జీతాలు పెంచరా? - జీతాలు

నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సీఐటీయూ నేతలు

By

Published : Jul 8, 2019, 11:20 PM IST

సీఐటీయూ ఆధ్వర్యంలో జీతాలు పెంచాలంటూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే అది కేవలం తమ శ్రమతోనే సాధ్యమని పారిశుద్ధ్య కార్మికులు అన్నారు. ఇలాంటి పనులు డబ్బులు ఎక్కువ ఇచ్చినా చేసే వారు ఉండరన్నారు. ఇంత పని చేస్తున్నా తమకు జీతాలు ఆశించినంతగా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించినప్పటికీ అమలు మాత్రం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి : సీఐటీయూ నేతలు

ABOUT THE AUTHOR

...view details