నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన మేకల సవిత (32) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్తకు వాళ్ళ అన్నకు గొడవ జరిగింది. అన్న తమ్ముడిపై బోధన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.
అన్నదమ్ముల మధ్య గొడవ... మహిళ ఆత్మహత్య - nizamabad district news
అన్నదమ్ముల మధ్య గొడవ అయ్యింది. తమ్ముడిపై అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన తమ్ముడి భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కమ్మన్పల్లిలో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
మనస్తాపం చెందిన సవిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భర్త చిన్న సైదయ్య బయట నుంచి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. అతను పోలీసులకు సమాచారం అందించారు. గ్రామీణ సీఐ రవీందర్ నాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండీ:ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు యువకుల దుర్మరణం