తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్మశానవాటిక కోసం గ్రామస్థుల ధర్నా - శ్మశాన వాటిక కోసం బోర్గాం గ్రామస్థుల ధర్నా వార్తలు

బోర్గాం(పి) గ్రామ శ్మశాన వాటికను కాపాడాలంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రం​లోని ప్రధాన రహదారిపై గ్రామస్థులు ధర్నా చేపట్టారు. ట్రాఫిక్​ భారీగా నిలిచిపోవడంతో పోలీసులు వాహనదారులను ఇతర మార్గాలకు మళ్లించారు.

The villagers' dharna for the cemetery
శ్మశానవాటిక కోసం గ్రామస్థుల ధర్నా

By

Published : Dec 16, 2019, 12:45 PM IST

నిజామాబాద్ నగర పాలక సంస్థలో విలీనమైన బోర్గాం(పి) గ్రామ శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ... నిజామాబాద్- హైదరాబాద్ రోడ్డుపై గ్రామస్థులు ధర్నా చేపట్టారు. శ్మశాన వాటికను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్యలపై స్పందించకపోవడంతో ధర్నాకు దిగామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

హైదరాబాద్ నుంచి నగరానికి చేరుకునే ప్రధాన దారి కావడం వల్ల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు గ్రామస్థులకు ఎంత చెప్పినా వినక పోవడంతో వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు.

శ్మశానవాటిక కోసం గ్రామస్థుల ధర్నా

ఇవీ చూడండి-చిన్నారిపై ఏడాదిగా మృగాడి అత్యాచారం.. బాలిక తల్లి ప్రోద్బలంతోనే..!

ABOUT THE AUTHOR

...view details