నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో గురువారం రాత్రి బాలుర వసతిగృహం పరిసరాల్లో చిరుతపులి కనిపించిందని కొందరు విద్యార్థులు అధికారులకు తెలియజేశారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్... పోలీసుల, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. యూనివర్సిటీకి చేరుకున్న అధికారులు... చిరుతపులి ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కోసం గాలింపు - తెలంగాణ విశ్వవిద్యాలయం
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచరిస్తోందని, విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కోసం గాలింపు
ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడం వల్ల విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలిస్తామని తెలిపారు. చిరుతపులి ఉన్నట్లు ఆధారాలు దొరికితే బోను ఏర్పాటు చేసి పట్టుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిఫోద్దీన్ వెల్లడించారు.
చిరుతపులి సంచరిస్తోందనే అనుమానంతో... విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని విశ్వవిద్యాలయ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.