నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబంలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన తండ్రిని కుమారుడు హత్య చేశాడు. తండ్రి గంగారాం(58)ను కుమారుడు గంగాధర్.. కర్రతో తల మీద కొట్టి చంపేశాడు. నిన్న రాత్రి పొలం వద్ద నిద్రించేందుకు గంగారాం వెళ్లగా... అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్లిన కుమారుడు కర్రతో తల మీద మోది చంపేశాడు. కుటుంబ తగాదాల వల్ల హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
దారుణం: తండ్రిని చంపిన తనయుడు - నిజామాబాద్ జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు
వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన కొడుకే... ఆ తండ్రి పాలిట కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి తలపై కొడుకు కర్రతో మోది చంపేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
దారుణం: తండ్రిని చంపిన తనయుడు
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం