మహారాష్ట్రలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా నిజమాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర చెక్ పోస్ట్ వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు - nizamabad district latest updates
కరోనా సెకండ్ వేవ్ విజృంభింస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులుకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు
పరిసర ప్రాంతాలని అధికారులు వారి ఆధీనంలోకి తీసుకొని ప్రతి ఒక్కరిపైన నిఘా పెట్టారు.. పక్కన ఉన్న అడ్డ రహదారులను మూసివేయించారు. దగ్గు, జలుబు, జ్వరం ఇతర సమస్యలతో ఉన్న వారిపై దృష్టి కేంద్రీకృతం చేసి పక్కాగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.